రాహుల్ గాంధీ సాహసోపేత నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లాల‌ని యొచిస్తున్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయీకరణ వ్యవస్థగా పేరొందిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ర‌ద్దు చేశారు. దాని స్థానంలో 34 మంది సభ్యులతో సారథ్య సంఘాన్ని రాహుల్‌ నియమించారు. ఈ సారథ్య సంఘం ఇవాళ సమావేశమై ప్లీనరీ తేదీని ఖరారు చేస్తుంది.
ఆ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం, గులాం నబీ ఆజాద్, జనార్దన్ ద్వివేదీ పాల్గొంటారు. అందులో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. మార్చి 5న పార్లమెంట్‌ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమవుతాయి.