అశేష అభిమానుల మధ్య అమెరికాలో మెగా స్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

వాస్తవం ప్రతినిధి : టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్ నగరంలో గత వారాంతం మెగా అభిమానులు (చిరంజీవి అస్సొసియెషన్ ఆఫ్ నార్త్ అమెరికా ) CANA వారు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ జన్మదినాలను భారీ గా నిర్వహించారు.
ఈ సందర్భం గా దాదాపు వెయ్యి మంది అభిమానులు ఒక్క డల్లాస్ నగరం నుండే కాక అమెరికా లోని వివిధ రాష్ట్రాలైన న్యూ జెర్సి , పెన్సిల్వేనియా , న్యూ యార్క్ , చికాగొ , కాలిఫొర్నియా , మిస్సోరి , ఫ్లొరిడా, అట్లాంటా , వాషింగ్టన్ డిసి ల్లాంటి దూర ప్రాంతాల నుండి సైతం విచ్చేసి స్థానిక బాబ్ ఉడ్రఫ్ పార్క్ లొ కుటుంబాలతొ సహా హాజరయ్యి వనభోజనాలు చేస్తూ. , ఒకరి నొకరు పరిచయాలు చేసుకుంటూ , చిరంజీవి మరియూ పవన్ కళ్యాణ్ సినిమాల్లొ పాటలు వింటూ , ఉల్లాసంగా గడిపారు.
ఈ వనభోజనాలు జరిగిన ప్రదేశం ఎత్తైన చెట్లు , చుట్టూ పచ్చటి పచ్చికబయళ్లు , ప్రక్కన్నే ప్రవహిస్తూ ఉన్న  ఓ అందమైన సెలయేరు , ఆ సెలయేటి నీటి పై నుండి మంద్రంగా వీస్తున్న చల్లటి గాలి తో అత్యంత మనొహరంగా వుంది.

ఉదయం పదకొండు గంటల సమయం లొ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకూ జరిగిన ఈ కార్యక్రమంలొ మహిళలు , పిల్లలు ఉత్సాహం గా పాల్గొని బింగొ , అంత్యాక్షరి వంటి అనేక రకాల ఆటలతొ , కేరింతల మధ్య , ఆనందంగా వేడుక ను జరుపు కోవడం కనిపించింది.

స్థానిక బిరియాని పాట్ రెస్టారెంట్ వారి నోరూరించే రుచి కరమైన అనేక రకాల వెజ్ అండ్ నాన్-వెజ్ వంటలు అందరిని మెప్పించాయి. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ భోజనాలను మెచ్చుకోవడం కనిపించింది.
ఎలాంటి రాజ కీయ ఉపన్యాసాలు గాని , పేరున్న తారలు, సెలబ్రిటీలు గాని , ఆకర్షణీయ వేదికలు గాని , వాటిపై వినొద కార్యక్రమాలు గానీ లేకున్నా అంతమంది హాజరయ్యి మెగా స్టార్ చిరంజీవి పై తమ అభిమానాన్ని చాటుకొవడం అత్భుతం అని అనెక మంది తమ అభిప్రాయాలను వాస్తవం కు తెలియ చేసారు .
పైగా అది లేబర్ డే లాంగ్ వీకెండ్ అన్న విషయం ఇక్కడ గమనార్హం . సహజం గా లాంగ్ వీకెండ్ లలో కుటుంబాలతొ సహా దూరప్రాంతాల్లొ విలాసంగా , విశ్రాంతి గా గడుపుతుంటారు .

సాయంత్రం భొజనాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచెస్తూ  కేక్ లను కట్ చేసి పుట్టిన రోజు సంబరాలను జరుపు కున్నారు .

ఈ సందర్భంగా CANA కార్యనిర్వాహక బృందం ఈ కార్యక్రమం ఇంత విజయవంతమవ్వ డానికి ముఖ్య కారకులు అయిన వాలంటీర్లను అభినందిస్తూ, అందరికి, పేరు పేరున తమ కృతజ్ఞతలను తెలియచేసారు.

మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల జన్మదిన వేడుకలు విజయవంతంగా నిర్వహించిన వారిలో శ్రీ కృష్ణ నంబూరి, శ్రీ చిట్టి ముత్యాల, శ్రీ శశాంక్ నిమ్మల, శ్రీ శివ వెజ్జు , శ్రీమతి ఇంద్రాణి కూనపురెడ్డి, శ్రీ శ్రీనివాస్ కూనపురెడ్డి, శ్రీమతి కీర్తి వడ్డీ, శ్రీమతి మోనికా పడాల, శ్రీమతి శ్రీదేవి వెజ్జు, శ్రీ కిషోర్ అనిసెట్టి, శ్రీ శ్రీనివాస్ తిరుమలశెట్టి, శ్రీ వెంకట్ జొన్నాడ, శ్రీ సురేష్ లింగినేని, శ్రీ సుబ్బారావ్ సాలాది, శ్రీ గోపీ తోకల, శ్రీ వెంకట సుగుణ, శ్రీ వీర కొత్త, శ్రీ రవి కలారి ఉన్నారు.

చివరగా మెగా అభిమానులు అందరూ నిష్క్రమిస్తూ ఈ కార్య క్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిర్వాహకులను మరి మరి కొరుతూ వారికి తమ హ్రుదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకొని ఒకరొకరుగా నిష్క్రమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here